కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ ఆర్.కృష్ణయ్య సీరియస్

కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ లో బీసీలకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

Update: 2023-02-03 10:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ లో బీసీలకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ బడాబాబులకు వత్తాసు పలుకుతూ బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు భారీగా రాయితీలు ఇచ్చారని రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు మాత్రమే బీసీలకు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ఈ మొత్తం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. బీసీలు దేశ సంపదలో వాటాదారులే తప్ప బిక్షగాళ్లు కాదన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు కేటాయింపులు పెంచాలన్నారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపుల్లో వెంటనే మార్పులు చేయాలని బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News