BREAKING: తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా రజనీకాంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ రంగంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగుతున్న రాంచందర్

Update: 2023-12-14 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ రంగంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగుతున్న రాంచందర్ రావు స్థానంలో తేరా రజనీకాంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుందని లీగల్ ఎఫైర్స్ కార్యదర్శి తిరుపతి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పలు కేసులు ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ నియామక ఉత్తర్వులకు ప్రాధాన్యత ఏర్పడింది. 


Similar News