Rajasingh: దాండియా వేడుకల్లోకి అలాంటి వారిని రానివ్వకండి.. రాజాసింగ్ హెచ్చరిక

దాండియా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-05 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ దాండియా కార్యక్రమాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాండియా కార్యక్రమాలకు బొట్టు లేకుండా వచ్చే వారిని అనుమతి ఇవ్వకూడదని నిర్వాహకులకు సూచించారు. దాండియా కార్యక్రమాలలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని అయితే ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అందువల్ల దాండియా కార్యక్రమానికి అనుమతి ఇచ్చే ముందు తప్పనిసరిగా సరైన పత్రాలు పరిశీలించాలని అలాగే లోపలికి వెళ్ళాక దుర్గాదేవిని దర్శించుకుని, నుదుటిపై మందపాటి తిలకం పెట్టుకున్న తర్వాతే దాండియాకు అనుమతి ఇవ్వాలన్నారు. ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే సంబంధిత వ్యక్తిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.


Similar News