Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు.. అసలు విషయం ఇదే!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ (Mangalhat) పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ (Mangalhat) పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తామని ఆగంతకులు రాజాసింగ్‌ను బెదిరించారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా ఆయన అనుచరులు కూడా తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మంగళ్‌హాట్ (Mangalhat) పోలీసులు రాజాసింగ్‌ను అప్రమత్తంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా 4+1 సెక్యూరిటీని సద్వినియోగం చేసుకోవాలని, నిత్యం వెంట బుల్లెట్ ప్రూఫ్ (Bullet Proof) వాహనాన్ని మాత్రమే వాడుకోవాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అయితే, గోషామహల్ (Goshamahal)లో ప్రాంతంలోని చిన్న చిన్న గల్లీల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ప్రజల్లోకి వెళ్లలేనని వారికి రాజాసింగ్ తెలిపారు. అదేవిధంగా తన గన్ లైసెన్స్ దరఖాస్తు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని, తన లైసెన్స్ రెన్యూవల్ చేయాలని రాజాసింగ్ పోలీసులను కోరారు.