రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.. హైకోర్టును ఆశ్రయిస్తాం: Raja Singh లాయర్
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఓ సామాజిక వర్గంపై మంగళవారం తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో రాజా సింగ్ చేసిన ఓ పోస్ట్ రెచ్చ గొట్టేలా ఉందంటూ మంగళ్‌హాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ఓ సామాజిక వర్గంపై మంగళవారం తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో రాజా సింగ్ చేసిన ఓ పోస్ట్ రెచ్చ గొట్టేలా ఉందంటూ మంగళ్‌హాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళ్‌హాట్ పోలీసులు జారీ చేసిన నోటీసులపై రాజాసింగ్ లాయర్ కరుణాసాగర్ స్పందించారు. పోలీసులు ఆరోపించినట్లు రాజాసింగ్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు.
పోలీసులు అధికార దుర్వినియోగం తోనే నోటీసులు జారీ చేశారని అన్నారు. రేపటిలోగా షోకాజ్ నోటీసులపై లిఖిత పూర్వకంగా పూర్తి వివరణ ఇస్తామని లాయర్ కరుణాసాగర్ పేర్కొన్నారు. తమ రిప్లైకి పోలీసులు సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాగా, నిన్న తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తాను ఫేస్‌బుక్‌లో చిన్న పోస్ట్ పెడితేనే పోలీసులు నోటీసులు జారీ చేయడం దురదృష్టకరమని అన్నారు. సీఎం కేసీఆర్, పోలీసులు తనపై ఎంత దృష్టిపెట్టారో అనడానికి ఇదే నిదర్శనమన్నారు.
Also Read...