ఆ జిల్లాలకు హెచ్చరిక.. ఈదురుగాలులతో కూడీ భారీ వర్షాలు పడే అవకాశం
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఓ వైపు భానుడు భగ భగలు కురిపిస్తుంటేనే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఈరోజు, రేపు రాష్ట్రంలోని
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఓ వైపు భానుడు భగ భగలు కురిపిస్తుంటేనే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జిగిత్యాలా, భూపాలపల్లి , కామారెడ్డి, ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు 30, నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.