Rain Alert: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. ఈ మేరకు రాబోయే మూడు రోజులు మే 10 నుంచి 13 వరకు అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మొత్తం జిలాల్లకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. గంటకు 40 కి.మీ.,నుంచి 50 కి.మీ., వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కొమర భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.