Rain Alert: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షం

హైదరాబాద్‌పై వరుణుడు మరోసారి ఉగ్రరూపం చూపిస్తున్నాడు.

Update: 2024-08-20 11:27 GMT
Rain Alert: నగరవాసులకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌పై వరుణుడు మరోసారి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తం అయ్యారు. కాగా, సాయంత్రం నగరంలో పలుచోట్ల మరోసారి భారీ వర్షం కురిసింది. ఉప్పల్‌, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇక ఎల్బీనగర్‌, నాగోల్‌, కాప్రాలో కూడా ఓ మోస్తారు వర్షం పడింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చెపట్టాయి. ఇక నగరంలో కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా భూదాన్‌ పోచంపల్లి, బీబీనగర్‌ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా ఇవాళ  ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.  

Tags:    

Similar News