Rain Alert: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన.. ఐఎండీ అధికారుల హెచ్చరిక

రుతు పవనాలు మరింత బలపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2024-07-12 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: రుతు పవనాలు మరింత బలపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలెర్ట్‌‌ను జారీ చేశారు. గురువారం ఉదయం నుంచి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్న జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News