కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్లు స్వాహా.. బీఆర్ఎస్ సర్కార్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో

Update: 2023-10-18 13:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. అభివృద్ధి అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. బీఆర్ఎస్‌కు రోజులు చెల్లాయని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇస్తామన్న మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఎవరికి అయిన వచ్చాయా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News