రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించాలి.. : డిప్యూటీ సీఎం భట్టి

భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాంక్షించారు.

Update: 2024-06-19 08:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాంక్షించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో జనాభా దామాషా ప్రకారం జనగణన జరగాలన్నారు. దేశ జనాభాకు అనుగుణంగా సంపద పంచాలనేది రాహుల్ ఆలోచన అన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డా ఇది నా దేశమని గర్వంగా తలెత్తుకునేలా చేయాలన్నారు. ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి నిర్మాణం జరగాలని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News