రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్.. : మంత్రి KTR

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Update: 2023-10-19 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడెలా ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుందా అన్నారు. ఫ్లోరోసిస్‌తో అల్లాడుతున్న నల్లగొండ కు చేసందేమి లేదన్నారు. మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆగమాగం అయ్యి ఓట్లు వేయకండని సూచించారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండన్నారు. ఎక్కడిక్కడ ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయండన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కుటుంబ పాలన అంటున్నారని.. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు ఒక కుటుంబం కాదా అన్నారు. వీళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటున్నారని.. కానీ ప్రాజెక్టు కట్టిందే 80 వేల కోట్లతో అన్నారు. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ అని కేటీఆర్ సెటైర్ వేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువతారన్నారు.రాహుల్ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఒక 420 అని, రేవంత్ కంటే అవినీతి పరుడు ఎవరు లేరన్నారు. ఓటుకు నోటు కేసులో దొరకిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. AtoZ స్కాం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆకాశం నుంచి భూమి లోపల దాకా కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ది అన్నారు. మేము బీజేపీ బీ-టీమ్ కాదని మీరే మా c (C- చోర్ టీమ్) టీమ్ అన్నారు. కాంగ్రెస్ లో ఎంత మంది గెలిచిన మళ్ళీ బీజేపీలో రేవంత్ రెడ్డి చేరుస్తాడన్నారు. బీజేపీ కోవర్ట్ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ గంప గుత్తగా ఎమ్మెల్యేలని బీజేపీ లో చేరుస్తాడన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే వికలాంగులకు న్యాయం జరుగుతుంది అని మీరంతా నమ్ముతున్నారన్నారు.

రూ.10,300 కోట్లు వికలాంగులకు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. 2లక్షల 25 వేల వికాలంగుల వాహనాలు ఇచ్చామన్నారు. వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. వినికిడి యంత్రాలు పంపిణీ చేసామన్నారు. తొమిదిన్నర ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పని తమ ప్రభుత్వం చేసిందన్నారు. మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నామన్నారు. రూ.4016 పెన్షన్ ఇస్తున్నామని, మళ్ళీ గెలిచిన తరవాత రూ.6వేల16 పెన్షన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ బీజేపీ‌లు ఓట్ల కోసం చాలా చాలా మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని ఉన్న సొంత రాష్ట్రంలో దివ్యాంగులకి ఇంత పెన్షన్ ఇవ్వటం లేదన్నారు. ఛత్తీస్ గఢ్‌లో లక్షకు పైగా వికలాంగులు ఉన్నారన్నారు. అక్కడ రూ.200 పెన్షన్ ఇస్తున్నారన్నారు. అక్కడ ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణ లో రూ.4వేల పెన్షన్ ఎలా ఇస్తుందన్నారు. డైలాగులు కొడితే ఓట్లు పడతాయా? అన్నారు. 

Tags:    

Similar News