అశోక్ నగర్‌లో నిరుద్యోగులతో టీ తాగిన రాహుల్.. రాత్రి వేళ ఆకస్మిక పర్యటన

తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తి్స్తున్నాయి. పార్టీల

Update: 2023-11-25 16:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తి్స్తున్నాయి. పార్టీల అగ్రనేతలు రంగంలోకి వరుస పర్యటనలతో శ్రేణుల్లో కొత్త జోష్ తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తూ.. తనదైన శైలీలో రాహుల్ దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉండగా.. ఇవాళ రాత్రి హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ అశోక్ నగర్‌లో రాహుల్ విద్యార్థులతో చిట్ చాట్ నిర్వహించారు. నిరుద్యోగులు, యువతతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీక్ ఘటనలు, నోటిఫికేషన్లు వేయకపోవడం వంటి అంశాలు నిరుద్యోగులు రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు తీరుస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు, నిర్యుగులతో కలిసి రాహల్ టీ తాగారు. రాహుల్ గాంధీతో పలువురు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత రాహుల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడి కస్టమర్లతో ముచ్చటించారు.

Tags:    

Similar News