ఆసక్తికర సీన్.. రోడ్డు పక్కన ఛాయ్ తాగిన రాహుల్ గాంధీ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యాలు
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడుతున్నారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలను కలవడంతో పాటు కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోన్నారు. ఇవాళ కోరుట్ల నుంచి రాహుల్ బస్సు యాత్ర మొదలుపెట్టగా.. అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా రోడ్డు పక్కన ఒక టీ షాపులోకి రాహుల్ వెళ్లారు. టీ షాపు నిర్వాహకులకు కాసేపు ముచ్చటించారు.
షాపులో పార్టీ నేతలతో కలిసి ఛాయ్ తాగారు. కాసేపట్లో ఆర్మూర్లో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ టార్గెట్గా రాహుల్ విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ పాలన అవినీతి పాలన అంటూ ఆరోపిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోన్నారు.