Rachakonda : 25 రోజుల్లో రూ. 2 కోట్ల విలువైన 591 ఫోన్లు రికవరీ.. రాచకొండ పోలీస్

ఫోన్ పోయినప్పుడు కలిగే బాధ వర్ణించలేనిది, అలాగే పోయిన ఫోన్ తిరిగి చేతికి వచ్చినప్పుడు కలిగే ఆనందం కూడా వర్ణనాతీతం. అలాంటి ఘటననే తాజాగా జరిగింది.

Update: 2024-09-05 13:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ పోయినప్పుడు కలిగే బాధ వర్ణించలేనిది, అలాగే పోయిన ఫోన్ తిరిగి చేతికి వచ్చినప్పుడు కలిగే ఆనందం కూడా వర్ణనాతీతం. అలాంటి ఘటననే తాజాగా జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు రూ. 2 కోట్ల విలువైన 591 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఇవాళ రాచకొండ పోలీస్‌లు సుమారు 2 కోట్ల విలువైన 591 ఫోన్లను రికవరీ చేసి, పోగొట్టుకున్న వారికి అందించారు. ఫోన్లను తిరిగి తమ దగ్గరకు చేర్చిన రాచకొండ పోలీసులకు ఆనందంతో ధన్యవాదాలు తెలిపారు.

కాగా, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్​బాబు ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీస్ ఐటీ సెల్ సమన్వయంతో 25 రోజుల్లో రెండు కోట్ల విలువైన 591 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 339, భువనగిరి పరిధిలో 103, మల్కాజిగిరి పరిధిలో 149 ఫోన్లను రికవరీ చేశారు. ఈ ఏడాది రాచకొండ పోలీసులు 3213 మొబైల్స్ రికవరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏదైనా మొబైల్ దొంగిలించబడిన, పోగొట్టుకున్నట్లయితే https://ceir.gov.inలో రిపోర్ట్ చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు పౌరులకు సూచించారు.


Similar News