రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం ఆర్ కృష్ణయ్య సంచలన ప్రకటన

బీసీ సంఘం జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య(R Krishnaiah')కు 2022 లో వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది.

Update: 2024-09-24 14:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీసీ సంఘం జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు(R Krishnaiah') 2022 లో వైసీపీ(YCP) ప్రభుత్వం రాజ్యసభ ఎంపీ(Rajya Sabha MP)గా అవకాశం ఇచ్చింది. దాదాపు రెండు సంవత్సరాలుగా రాజ్యసభ ఎంపీగా కొనసాగి ఆయన ఈ నెల 23న స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను పంపారు. కాగా మంగళవారం సాయంత్రం ఆయన రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. అయితే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయం అయినట్టు అందరూ భావించారు. కానీ ఆయన తన రాజీనామా పై స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి కొన్ని అడ్డంకులున్నాయని, బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

అలాగే తన పదవికి మరో నాలుగేళ్ల సమయం ఉన్నా.. బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బీసీ ఉద్యమం(BC movement) పెంచాలని కొన్ని నెలలుగా నిరసనలు చేపట్టామని.. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా.. బీసీ రిజర్వేషన్లను పెంచలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని, చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని, బీసీ డిమాండ్లకు ఏ పార్టీ మద్దతు ఇస్తే వారి మద్దతు తీసుకుంటామని బీసీ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.


Similar News