కాంగ్రెస్ బేషజాలకు పోకుండా పాలమూరును పూర్తిచేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

రిజర్వాయర్‌ల వారీగా, లిఫ్ట్‌ల వారీగా ప్రభుత్వం రివ్యూలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. చెక్ డ్యామ్‌లు, కాలువల పూర్తి పై మంత్రులు దృష్టి సారించాలన్నారు.

Update: 2024-09-24 17:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వాయర్‌ల వారీగా, లిఫ్ట్‌ల వారీగా ప్రభుత్వం రివ్యూలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. చెక్ డ్యామ్‌లు, కాలువల పూర్తి పై మంత్రులు దృష్టి సారించాలన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, నాయకులు బొమ్మెర రామమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. 10 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై కదిలిందని, దీనిని స్వాగతిస్తున్నామన్నారు. ఏదుల, నార్లాపూర్, ఏదుల కరివెన తదితర పంప్ హౌజ్‌లు కేసీఆర్ పాలనలోనే పూర్తయ్యాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా తొంభై శాతం పూర్తయ్యాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు కొనసాగిస్తే కాల్వలు పూర్తై రైతులకు సాగునీరు కూడా అందేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు భేషజాలకు పోకుండా పాలమూరు పథకం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పై కోపంతో పనులను ఆలస్యం చేయొద్దు అని కోరారు. వట్టెం పంపు హౌజ్ మునక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సూచనలను సద్విమర్శలుగా మంత్రులు భావించాలన్నారు. వచ్చే పంటకు పాలమూరు ద్వారా నీళ్లిచ్చే భాద్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.


Similar News