Smita sabharwal: బంగారు గాజులు వేసుకుని సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లిన స్మితా సబర్వాల్.. ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడిగారంటే?(వీడియో)
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను తెలంగాణ సీఎంవో నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
దిశ, ఫీచర్స్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను తెలంగాణ సీఎంవో నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈమెను నీటిపారుదల శాఖ కార్యదర్శి పోస్టు నుంచి బదిలీ చేశారు. సీఎంవోలోకి సీనియర్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డిని తీసుకోగా.. నీటి పారుదల శాఖ కార్యదర్శిగా మరో సీనియర్ అధికారి రాహుల్ బొజ్జాను నియమించారు. అయితే రీసెంట్ గా స్మితా సబర్వాల్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. సివిల్స్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో చెప్పుకొచ్చారు.
‘‘నేను ఇంటర్వ్యూకు ఓపెన్ మైండ్ తో వెళ్లాను. క్లియర్ చేస్తానని వెళ్లలేదు. నేను సివిల్స్ క్లియర్ చేసినా చేయకున్నా.. ఇంత వరకు రావడం ఎక్కువని అనుకున్నాను. ఈ ప్రశ్న మీదే నా జీవితం మొత్తం ఆధారపడి ఉందని నేనేమి ఒత్తిడి తీసుకోలేదు. మెయిన్ ఇంటర్వ్యూకు ముందు రెండు మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. వారు మొత్తం అకాడమిక్ క్వశ్చన్స్ అడిగారు.
అలాగే సివిల్స్ ఇంటర్వ్యూలో సివిల్స్ ఫారెన్ సర్వీసెస్‌కు సంబంధించి ప్రశ్నలు చాలా అడిగారు. నాకు ఆ సబ్జెక్ట్ పై ఆసక్తి ఉండడంతో సులభంగా సమాధానాలు చెప్పగలిగాను. ఫారెన్ సర్వీసెస్‌కు తాను సరిపోతానని వాళ్లు చెక్ చేశారు. ఒకట్రెండు ప్రశ్నలు ఎకనామిక్స్, బ్యాంకింగ్ నుంచి అడిగారు. మొత్తం12 క్వశ్చన్స్ అడిగారు. ఆరు, ఏడు ప్రశ్నలకు బాగా సమాధానం చెప్పాను. నేను గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుని ఇంటర్వ్యూకు వెళ్లాను.
నా గాజులు చూసి గోల్డ్ కు సంబంధించి ప్రశ్నలు కూడా అడిగారు. గోల్డ్ ప్యూరిటీకి స్టాండర్డ్ ఏంటని అడిగారు. నాకు తెలియదని చెప్పేశాను. మనకు తెలిస్తే ఊహించాలి. కానీ దానిపై ఏ మాత్రం అవగాహన లేదు.. ఊహిస్తే తెలిసిపోతుంది. అందుకే వెంటనే నాకు తెలియదు సార్ అని చెప్పేశాను. కాసేపయ్యాక వాళ్లు గెస్ చేసి చెప్పమన్నారు. అయినా కూడా నాకు తెలియదనే చెప్పాను’’. అంటూ స్మితా సబర్వాల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.