ఫింగర్ ప్రింట్ కిట్ల అందజేత

నేరాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫింగర్ ప్రింట్ యూనిట్లను పోలీస్ ఉన్నతాధికారులు మరింత బలోపేతం చేస్తున్నారు.

Update: 2023-04-26 07:03 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: నేరాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫింగర్ ప్రింట్ యూనిట్లను పోలీస్ ఉన్నతాధికారులు మరింత బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఐడి అదనపు డీజీపీ మహేష్ భగవత్ బుధవారం కోటీ 33 లక్షల వ్యయంతో కొన్న అధునాతన ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్స్ కిట్లను రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్బీనగర్ జోన్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ టీంలకు తన కార్యాలయంలో అందచేశారు.

ఈ సందర్భంగా ఆయా కిట్లలోని పరికరాల ద్వారా వేలి ముద్రలు ఎలా సేకరిస్తారని క్లూస్ టీముల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే స్టేట్ ఫింగర్ ప్రింట్ బ్యూరోతో పాటు అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు ఈ కిట్లను అందచెయ్యనున్నట్టు చెప్పారు. ఇక, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ తాతారావు మాట్లాడుతూ.. సీఐడీ ఛీఫ్ చేతుల మీదుగా ఇలాంటి అధునాతన కిట్లు అందుకోవటం ఇదే మొదటిసారి అని చెప్పారు.

Tags:    

Similar News