Sculptor MV Ramanareddy : ఆరోపణలు రుజువు చేయి..లేదా క్షమాపణ చెప్పు: సిధారెడ్డికి రమణారెడ్డి సవాల్

సచివాలయంలో ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli Statue) రూపకల్పనకు తాను ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నట్లుగా రచయిత నందిని సిధారెడ్డి(Sidha Reddy) చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేదా పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి (Sculptor MV Ramanareddy) సవాల్ చేశారు.

Update: 2024-12-12 10:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : సచివాలయంలో ఆవిష్కరించబడిన తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli Statue) రూపకల్పనకు తాను ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నట్లుగా రచయిత నందిని సిధారెడ్డి(Sidha Reddy) చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేదా పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి (Sculptor MV Ramanareddy) సవాల్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పుపై ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డి చేసిన తనపై చేసిన వ్యాఖ్యలపై రమణారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి సిద్దిపేటలోనే చదువుకున్నానని, కళాకారుడిగా మాత్రమే నా పాత్ర అని..గత ప్రభుత్వ హయాంలోనూ అమరజ్యోతి, తెలంగాణ తొలి శకటం కూడా నేనే ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనపై నందిని సిధారెడ్డి చేస్తున్న మాటలు చాలా దుర్మార్గమన్నారు. ఆర్టిస్టులు డబ్బుల కోసం చేస్తున్నారని అని సిధారెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. నా సృజనాత్మకత..పనితీరుపై నమ్మకం ఉండబట్టే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని..తనపై వచ్చిన ఆరోపణలకు ఆవేదనతో ఇక్కడికి వచ్చానని తెలిపారు.

2017 లో తొలి తెలంగాణ శకటం చేశానని.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రమణాచారి, అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో లేఖలు రాసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. అదే ప్రభుత్వం బీహార్‌కు చెందిన వ్యక్తికి 30 లక్షలకు పైచిలుకు ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే తొలి అమర జ్యోతి స్తూపాన్ని తయారు చేశానని.. ఏడేండ్లు అవుతున్నా కనీసం 40 శాతం డబ్బులు ఇవ్వలేదని.. కానీ కాంట్రాక్టర్‌కు 98 శాతం డబ్బులు ఇచ్చారని తెలిపారు. 14ఏండ్లు జర్మనీలోనే ఉండి తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక పోస్టర్లు వేశానని.. ఎలాంటి రాజకీయ కోణాలు లేకుండా నేను పని చేస్తే ఈ విధంగా ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. ‘‘ మీ అవసరాల కోసం నిజాయితీ కలిగిన నా వంటి వ్యక్తిపై ఆరోపణలు సిగ్గు చేటు’’ అంటూ సిధారెడ్డిపై రమణారెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో అనేకమైన అభినందనలు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి సరికొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ ఆలోఛన మేరకు విగ్రహాన్ని సరికొత్తగా చేయాల్సి వచ్చిందన్నారు.. తెలంగాణ తల్లిని సాంప్రదాయంగా తీసుకోవాలనే ఆలోచనతోనే సరికొత్త రూపాన్ని తీసుకొచ్చినట్లు ఎంవీ రమణారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వాలు అధికారికంగా ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదన్నారు. సకల జనుల పోరాటాలు..ఆత్మత్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అదే స్ఫూర్తి విగ్రహంలో కనిపిస్తుందన్నారు.

Tags:    

Similar News