KTR: మరికొద్దిసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లు
ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case)లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నేడు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ (ACB) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case)లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)ను నేడు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ (ACB) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మరికొద్దిసేపట్లోనే ఆయన రాయదుర్గం ఓరియన్ విల్లా నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి నేరుగా 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీ (ACB) కార్యాలయంతో పాటు తెలంగాణ భవన్ (Telangana Bhavan)ఎదుట భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణకు హాజరు అవుతుండటంతో నందినగర్‌లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు.
అయితే, కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)ని హౌజ్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా 100 మందికి పైగా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్వీ నేత మేకల విద్యా సాగర్ (Mekala Vidya Sagar)ను కూడా పోలీసులు మందుస్తు అరెస్ట్ చేశారు. కాగా, కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ (Arvind Kumar), హెచ్ఎండీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)లకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ విచారణ స్టేట్‌మెంట్ తీసుకోవడం పూర్తయిన వెంటనే ఆ ఇద్దరిని కూడా అధికారులు విచారించనున్నారు.