హైదరాబాద్ విద్యార్థినిని అభినందించిన ప్రధాని (వీడియో)
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మన్ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆయన ఆయన అభినందించారు. మరోవైపు తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో పోస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మన్ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆయన ఆయన అభినందించారు. మరోవైపు తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో పోస్ట్ చేశారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఆకర్షణ సతీష్.. సొంతంగా ఏడు లైబ్రరీలను స్థాపించడాన్ని ప్రధాని కొనియాడారు. హైదరాబాద్‌లో లైబ్రరీలకు కోసం కృషి చేసిన ఆకర్షణ గురించి తెలుసుకున్నాని చెప్పారు.
క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించిందని మన్ కీ బాత్‌లో తెలిపారు. పేద పిల్లల కోసం ఇప్పటివరకు లైబ్రరీల్లో సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చిన్న 'ఆకర్షణ' విశేషంగా కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తంచేశారు.
చదువుకోవడం ,నేర్చుకోవడంలో గల ఆనందాన్ని, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వ్యాప్తి చేయడానికి అభినందించదగ్గ కృషి చేసిన బాలిక ,ఆకర్షణ సతీష్‌ను చూసి గర్విస్తున్నాను.#MannKiBaat pic.twitter.com/J7b9tzBh5B
— Narendra Modi (@narendramodi) September 24, 2023