కేసీఆర్‌కు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు: మాజీ మంత్రి వేముల ఫైర్

బీఆర్ఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ

Update: 2024-06-21 16:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ పోచారంను సంబోధిస్తూ పార్టీలో అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇచ్చారన్నారు. ముందు వరుసలోనే కేసీఆర్ పక్కనే కూర్చుండబెట్టుకునే వారన్నారు. పార్టీ కేడర్‌కు ఆదర్శంగా చూపేవారని, వ్యవసాయ మంత్రిగా, శాసనసభాపతిగా సమున్నత స్థానం కల్పించారన్నారు. బాన్సువాడ అభివృద్ధికి అడిగినన్ని నిధులిచ్చారని, రోడ్లకు,చెక్ డ్యాంలకు, ప్రాజెక్టు లకు,డబుల్ బెడ్రూం ఇళ్లకు, ఇతర అభివృద్ధి పనులకు కాదనకుండా అధిక నిధులిచ్చారన్నారు.

సీఎం డెవలప్మెంట్ నిధుల నుండి అత్యధికంగా తీసుకున్నది పోచారం అన్నారు. తాను హౌసింగ్ మినిస్టర్‌గా ఉన్నా.. బాన్సువాడకు అడిగినన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని, ఇదంతా కేవలం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత వల్లే కదా..! అని ప్రశ్నించారు. ప్రాణం పోయే వరకు కేసీఆర్ గారి వెంటే ఉంటానని చెప్పి పార్టీ మారడం బాధాకరం అన్నారు. అధికారం, పదవులు లేకుంటే బ్రతకలేమా.. ఈ వయస్సులో పార్టీ మారడం భావ్యమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో పోచారం చేరడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం అన్నారు. బాన్సువాడ ప్రజలే దీనిపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.


Similar News