తెలంగాణ ప్రజల చెవిలో పూలు పెడుతున్న కేసీఆర్: KA Paul

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వులు పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు.

Update: 2023-06-27 09:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వులు పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. కేసీఆర్ వందలో ఒకటి కూడా నిజం మాట్లాడరని, అబద్ధం చెప్పేవాళ్ళకు ఆయన జనకుడు అని పేర్కొన్నారు. ఆంధ్రాలో వంద ఎకరాలు.. తెలంగాణలో ఒక ఎకరంతో సమానం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని అన్నారు. ఈ మేరకు కేఏపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనకు విశాఖలో ఒక ఎకరం ఉందని అది రెండు కోట్ల విలువ ఉంటుందని, విజయనగరంలో తనకు 20 ఎకరాలు ఉన్నాయని దాని విలువ ఒక ఎకరానికి రెండు కోట్లు పలుకుతుందన్నారు. తెలంగాణ సంగారెడ్డి దగ్గర ఒక ఎకరం 50 లక్షలు మాత్రమే అని అన్నారు.

ఇంకా ఆంధ్రాలోని విశాఖ విజయనగరం జిల్లాలలో ఒక ఎకరం పది కోట్లు, 20 కోట్లు పలుకుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందే గాంధీ కుటుంబమని ఆరోపించారు. కాంగ్రెస్ కు 60 ఏళ్లు అవకాశం ఇచ్చామని మళ్ళి అవకాశం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అదానీ, అంబానీ లాంటి వందల మందిని కుబేరులను చేసిందే గాంధీ కుటుంబీకులే అని అన్నారు. సోనియా గాంధీ ఒక విదేశీ ఎజెంట్ అని, తన పీస్ మిషన్‌ను ఆమె క్యాన్సల్ చేసీ.. దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఈ కుటుంబ అవినీతి పాలనను అంతం చేద్దామని కేఏపాల్ పిలుపునిచ్చారు.

Read more:

KCR పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News