కరవుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణం కాదు: పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాలు సందర్శనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన వీడియో విడుదల చేశారు.

Update: 2024-04-05 11:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాలు సందర్శనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిచారు. ఈ సందర్భంగా ఆయన వీడియో విడుదల చేశారు. కరువుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణం కాదన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు. మీరు రాజకీయంగా నిజంగా బీజేపీతో లేనట్లయితే.. రైతుల ప్రయోజనాలను కాపాడే నట్లయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.. మీరు రండి కలిసి వెళదామన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడిగినటువంటి అనేక సంఘటనలు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నామన్నారు.

బీజేపీ నేత ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నాడని బండి సంజయ్ రైతు దీక్షపై విమర్శించారు. మీరు కూడా రండి దీక్ష గల్లీలో కాదు ఢిల్లీలో ప్రధాని మోడీ దగ్గర చేయాలన్నారు. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదని, తెలంగాణ రైతన్న ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తమకు కేంద్రంతో కొట్లాడి ఆలోచన లేదని, ఎటువంటి భేషాజాలం లేదు కేంద్రం సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మధ్యవర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మిగతా నాయకత్వం ముందుకు రావాలన్నారు. 

Tags:    

Similar News