Ponguleti: డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) జరుగుతాయని వచ్చే సంక్రాతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని అన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి... తెలంగాణలో సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేండ్ల ఒక నెల పీరియడ్ ఉందని అప్పటి వరుక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నే కొనసాగుతారన్నారు. కాంగ్రెస్ రెండవ సారి అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్:
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. లదారుల ఎంపికలో ఈ ప్రత్యేక యాప్ దే కీలకపాత్ర అని అందుకే ఇంత సమయం పట్టిందన్నారు. ఆధార్‌తో సహా అన్నివివరాలు యాప్ లో పొందుపరుస్తామని తెలిపారు. ఈనెల 5,6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలే ఫైనల్ చేస్తాయని, స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుందన్నారు. ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, పేదరికమే ప్రామాణికంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుందన్నారు.ఇంట్లోని మహిళల పేరుతోనే ఈ ఇండ్లు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. 4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
లబ్ధిదారుల ఇష్టప్రకారమే డిజైన్:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవని మంత్రి చెప్పారు. లబ్దిదారుల ఇష్టం మేరకు ఇల్లు నిర్మించుకోవచ్చని స్పష్టం చేశారు. 4 దశల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్మాణ దశల వారీగా లబ్దిదారులకు చెల్లింపులు చేస్తామన్నారు. పునాదికి లక్ష, గోడలకు లక్షా 25వేలు, శ్లాబ్‌కు లక్షన్నర ఇల్లు పూర్తయ్యాక మరో లక్ష రూపాయల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు మిగతా మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తుందన్నారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించబోతున్నామని ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్లు నిర్మించేలా చూస్తామన్నారు. ప్రభుత్వం తరపున 5 లక్షల సాయం ఇస్తామని లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా కట్టుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600-800 ఇండ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామన్నారు.
స్థలాలు లేని వారికి రెండో దశలో..
ఇండ్ల స్థలాలు లేని వారికి 2వ దశలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు. నందనవనం, మంకాల్ ఇండ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని సమకూర్చి ఇస్తామన్నారు. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే కరెంట్, రోడ్లు , డ్రైనేజ్ తదితర మౌళిక వసతులను ప్రభుత్వంమే సమకూరుస్తుందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఇండ్ల నిర్మాణం విషయంలో కేంద్రం ఎంతిచ్చినా తీసుకుంటామన్నారు. ఏమీ ఇవ్వకపోయినా ఇండ్లను నిర్మించి పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి బేషజాలకు పోవడం లేదని, మాకు ఇగోలు లేవన్నారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి కేంద్రాన్ని ఇండ్లు అడగలేదన్నారు.