బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. ఆ రోజే హస్తం పార్టీలో జాయినింగ్..?
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి జూమ్ మీటింగ్‌లో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశం అనంతరం జూన్ 22వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి నిర్ణయించుకున్నట్లు టాక్.
రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు సమాచారం. పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ కూడా అదే రోజున హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి చేరిక అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీ రానుండటంతో.. ఈ విషయంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే రోజు హస్తినకు వెళ్లనున్నట్లు సమాచారం.
Read more: బిగ్ న్యూస్: మరో కీలక హామీకి KCR ఎగనామం.. రోజు రోజుకు రైతుల్లో పెరుగుతోన్న ఆందోళన..