Politics: ఓవర్ టూ ఢిల్లీ.. హస్తినకు చేరిన రాష్ట్ర రాజకీయం

Update: 2024-11-12 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయం పూర్తిగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నట్లైంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు స్కామ్‌లకు పాల్పడ్డారని ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కిస్తున్న ఈ టైంలో.. ముందుగా కీలక ప్రతిపక్ష కేటీఆర్ ఢిల్లీ చేరి ప్రభుత్వంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అదే టైంలో ఆల్రెడీ కేటీఆర్ ఈ-కార్ రేస్ స్కా్మ్ చేశారని, ఆయనపై కేసు నమోదు చేసేందుకు అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరుతూ లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఇప్పుడు ఢిల్లీ చేరుకోవడం సంచలనంగా మారింది. ఇక ఫైనల్‌గా ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కూడా ఢిల్లీ చేరడంతో మొత్తం రాష్ట్ర రాజకీయం హస్తినకు చేరినట్లైంది. అసలు నలుగురు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో క్రోనోలాజీ ప్రకారం ఒక్కసారి పరిశీలిస్తే..

1. కేటీఆర్ ఢిల్లీ టూర్

నిన్న సోమవారం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అక్కడ తెలంగాణ సర్కార్‌లో జరిగి అమృత్-2 స్కీమ్ టెండర్స్ వ్యవహారంలో అక్రమం జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

2. హస్తినలో రేవంత్ రెడ్డి

ఇదే టైంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లడం సంచలనంగా మారింది. అయితే అక్కడ ఓ ప్రైవేటు సంస్థ మీటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల గురించి కూడా చర్చిస్తారని సమాచారం అందుతోంది. అయితే కేటీఆర్ కంప్లైట్ గురించి, ఈ-కార్ రేస్ కేసు గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తారా.? లేదా..? అనేది ఇప్పుడు సస్సెన్స్‌గా మారింది.

3. ఢిల్లీకి డిప్యూటీ సీఎం

మరోవైపు విద్యుత్ డిస్కంల భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున.. ఆ విషయంపై డిస్కంలతో చర్చించేందుకు భట్టి హస్తినకు చేరారు.

4. ఢిల్లీకి పయనమైన గవర్నర్:

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సమయంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఆయన ఎందుకు వెళుతున్నారనేది ఇప్పుడు సస్పెన్స్. ఏసీబీ కేసు అనుమతి గురించి చర్చించడానికే వెళుతున్నారా..? లేదా ఇంకేదైనా విషయంపై చర్చించడానికి వెళుతున్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఒకే సమయంలో ఇలా కీలక వ్యక్తులంతా ఢిల్లీ చేరడం.. ఇరు పక్షాలపై స్కామ్‌లకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తుండడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయం పూర్తిగా దేశ రాజధానికి చేరినట్లైంది. మరి ఇక ఏం జరుగుతుందో చూడాలి.


Similar News