మార్చి 3 నుంచి పోలియో చుక్కలు..

పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మార్చి 3వ తేదీన పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు.

Update: 2024-02-29 12:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మార్చి 3వ తేదీన పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి 3,4,5 తేదీల్లో చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయనున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి అనేక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి.. పోలియో చుక్కలు వేయనున్నారు.

ఈ మేరకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల అయ్యింది. ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం పోలియో చుక్కలు వేయిద్దాం.. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం.. అంటూ పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించండని పిలుపునిచ్చారు. రెండు చుక్కలు వేయించండి.. పోలియో పై విజయం సాధించండి.. అని పేర్కొన్నారు.

Tags:    

Similar News