Ganesh Immersion : భక్తుల హృదయాలు గెలిచిన పోలీస్! తలకు గాయమైనా నిమజ్జనం డ్యూటీ

గ్రేటర్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎస్సై బొజ్జ రవీందర్ తలకు గాయమై రక్తం కారుతున్న నిమజ్జనం విధుల్లో సేవలు అందించి భక్తుల మనసులు గెలిచారు.

Update: 2024-09-17 12:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎస్సై బొజ్జ రవీందర్ తలకు గాయమై రక్తం కారుతున్న నిమజ్జనం విధుల్లో సేవలు అందించి భక్తుల మనసులు గెలిచారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ ఎక్స్ వేదికగా వివరాలతో ఆసక్తికర పోస్ట్ చేశారు. గుండ్ల సింగారం ముచ్చర్ల ఓఆర్ఆర్ వద్ద నిమజ్జనం సోమవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. తెల్లవారుజామున రెండు దాటాక తలకు దెబ్బతాకిందని వరంగల్ పోలీస్‌లు తెలిపారు. సున్నితమైన ప్రాంతం కావడంతో టోపీ కింద గాయమైన ప్రాంతం నుంచి ముఖం మీదకు రక్తం కారడం మొదలైంది. అక్కడే ఉన్న పోలీస్, వివిధ శాఖల సిబ్బంది ఎస్సైని చూసి ఆందోళన చెందారు.

తల గాయం కావడంతో సిటీలోని హాస్పిటల్ వెళ్లాలని సూచించారు. వెహికల్ తీశారు. కానీ.. అప్పటికే వినాయక విగ్రహాలు వరుసకట్టి ఉండటంతో.. ఆఫీసర్ నొప్పిని భరిస్తూ డ్యూటీలోనే ఉన్నారు. రక్తం అలానే రావడంతో చివరకు దగ్గర్లో ఉన్న 108 సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ అందించారు. మెడికల్ సిబ్బంది విశ్రాంతి తీసుకోమని వారిస్తున్నా వినకుండా ఎస్సై రవీందర్ 5-10 నిముషాల్లో మళ్ళీ విధుల్లోచేరి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూశారు. దీంతో కేయూ ఎస్సై అక్కడున్న భక్తుల హృదయాలు గెలిచాడు.


Similar News