నగరంలో గంజాయి ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు.. భారీగా హాష్ ఆయిల్ పట్టివేత

తెలంగాణ, హైదరాబాద్‌లను మత్తు రహిత ప్రాంతాలు తీర్చిదిద్దేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గంజాయి, డ్రగ్స్ వాడకం, అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Update: 2024-08-12 06:48 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ, హైదరాబాద్‌లను మత్తు రహిత ప్రాంతాలు తీర్చిదిద్దేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గంజాయి, డ్రగ్స్ వాడకం, అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామును గంజాయి ముఠాను రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి దాదాపు 13 కేజీల హాష్ ఆయిల్ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని విలువ మార్కెట్లో రూ. 11 కోట్ల వరకూ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాకు చెందిన కొండబాబు, బాలకృష్ణలు హాష్ ఆయిల్ ను డబ్బాలో పెట్టుకుని బెంగళూరుకు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి గంజాయి నెటవర్క్ కు సంబంధించిన కూపీ లాగేందుకు ప్రయత్నింస్తున్నామని.. పోలీసులు మీడియాతో చెప్పుకొచ్చారు.


Similar News