మందుబాబులకు బిగ్ అలర్ట్.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఆ టైమ్‌ నుంచే స్టార్ట్!

న్యూ ఇయర్ వేడుకల వేళ తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ వ్యాప్తంగా విధించిన ఆంక్షలపై సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-31 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేడుకల వేళ తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ వ్యాప్తంగా విధించిన ఆంక్షలపై సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఆదివారం రాత్రికి ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్‌లు మూసివేస్తామని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని హెచ్చరించారు.

కేవలం డ్రింక్స్ చేసిన వారినే కాకుండా.. స్టంట్స్, ఓవర్ స్పీడ్‌ వెళ్లిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వేడుకల కోసం అనుమతి కోరిన వారికి సూచనలు చేశామని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ విషయంలో పబ్స్ జాగ్రత్త వహించాలని.. ఎక్కడ దొరికినా ఆ పబ్‌ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పబ్బుల వద్దనున్న సీసీ కెమెరాల వద్ద కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News