రోహిత్ వేముల కేసు ముగించిన పోలీసులు.. తుది రిపోర్టులో ఏముందో తెలుసా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల కేసు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల కేసు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ హైకోర్టులో రోహిత్ వేముల కేసు విచారణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు, ఎవిడెన్స్ లేవని కోర్టుకు రిపోర్టు సమర్పించారు. ఇందులో వీసీ అప్పారావుకు ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. రిపోర్టులో పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని తేల్చారు. కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.