Telangana New Secretariat :సెక్రటేరియట్ వద్ద తొలి రోజే పోలీసులతో ఘర్షణ.. అది లేకుంటే నో ఎంట్రీ!
కొత్త సచివాలయం దగ్గర పోలీసుల ఆంక్షలు ఉద్యోగులనే ఇబ్బందికి గురిచేసింది. ఇంతకాలం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సెక్యూరిటీ విధులు నిర్వహించేవారు. దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా డ్యూటీలో ఉండడంతో ఎంప్లాయీస్‌ను గుర్తుపట్టేవారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం దగ్గర పోలీసుల ఆంక్షలు ఉద్యోగులనే ఇబ్బందికి గురిచేసింది. ఇంతకాలం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సెక్యూరిటీ విధులు నిర్వహించేవారు. దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా డ్యూటీలో ఉండడంతో ఎంప్లాయీస్‌ను గుర్తుపట్టేవారు. కానీ కొత్త సెక్రెటేరియట్‌కు తెలంగాణ స్పెషల్ పోలీసులను నియమించడంతో గుర్తుపట్టే సమస్య తలెత్తింది. ఉద్యోగులకు నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఎంట్రీల నుంచి లోపలికి వెళ్ళడానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా సెక్యూరిటీ విధుల్లో ఉన్న స్పెషల్ పోలీసులు మాత్రం ఈ గేటు నుంచి కాదు.. ఆ గేటు నుంచి వెళ్ళండి.. అంటూ తిప్పిపంపుతున్నారు. ఉదయం పది గంటలకంటే ముందే డ్యూటీకి వచ్చినా కార్లను లోపలికి వెళ్ళడానికి అనుమతించకపోవడంతో పన్నెండు గంటల సమయానికి కూడా కన్‌ఫ్యూజన్ కొనసాగుతూ ఉన్నది.
ఉద్యోగుల ఐడీ కార్డులను చూసిన తర్వాతనే పోలీసులు లోపలికి పంపుతుండడంతో అవి లేనివారికి ఎంట్రీ సాధ్యం కావడంలేదు. బైక్‌ల విషయంలో సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ కావడానికి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా కార్లలో వచ్చే ఉద్యోగులకు మాత్రం చిక్కులు తలెత్తాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్, సచివాలయం దగ్గర పోలీసులకు వారి హయ్యర్ అఫీషియల్స్ ఇచ్చిన ఆదేశాలు భిన్నంగా ఉండడంతో ఈ సమస్యలు తలెత్తాయి. టైమ్‌కు సచివాలయం దగ్గరకు చేరుకున్నా పోలీసుల ఆంక్షలతో డ్యూటీకి హాజరుకావడంలో జాప్యం జరుగుతున్నది. ఫస్ట్ రోజునే స్పెషల్ పోలీసులకు, ఎంప్లాయీస్‌కు మధ్య మాటల యుద్ధం, వాదనలు, ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇక ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడం అనివార్యమని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
Read more: