Telangana Police : వాట్సాప్‌లో అపరిచితుల నగ్న వీడియో కాల్స్.. రెస్పాండ్ అయితే అంతే!

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సామాజీక మాధ్యమాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. వారి ఉచ్చులో పడేలా చేస్తున్నారు.

Update: 2024-09-05 15:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సామాజీక మాధ్యమాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. వారి ఉచ్చులో పడేలా చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి మీకు వీడియో కాల్స్ వచ్చినా.. లేదా మహిళలకు అపరిచిత వీడియో కాల్స్ వచ్చిన వాటికి ఏ మాత్రం రెస్పాండ్ అయిన మీరు వారి చిక్కుల్లో పడిపోతారు. తర్వాత వారు వాట్సప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మీకు నగ్న వీడియోలు పంపుతారు.

వాటిని కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇంటర్నెనెట్‌లో పెడుతామని వేధింపులకు దిగుతారు. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. ఎవరైనా అపరిచిత నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఆ కాల్స్ ను ఎట్టిపరిస్థితుల్లో లిఫ్ట్ చేయవద్దని పేర్కొన్నారు. ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్లు న్యూడ్ లో ఉండి రికార్డు చేస్తారని, ఆ వీడియోతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసిస్తారని, తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.


Similar News