ఇవాళ రాత్రి నిద్రపట్టదు.. బీఆర్ఎస్ సర్కార్‌పై మోడీ సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో ఆదివారం టీ బీజేపీ తలపెట్టిన బహిరంగా సభలో ఆయన పొల్గొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరులో ఆదివారం టీ బీజేపీ తలపెట్టిన బహిరంగా సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ మజ్లిస్ చేతిలో ఉందని.. ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో అందరికి తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. సామాన్య ప్రజల గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఆ రెండు కుటుంబాలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పార్టీని నడుపుతున్నాయని ధ్వజమెత్తారు.
ఆ కంపెనీలో డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ అన్ని పదవులు ఆ కుటుంబ సభ్యులవేనని అన్నారు. కొన్ని అసవరాల కోసం కొందరిని సహయకులుగా నియమించుకున్నాయన్నారు. బీజేపీపై ప్రజలు చూపిస్తోన్న ప్రేమ చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఇవాళ రాత్రి నిద్ర పట్టదని సెటైర్ వేశారు. పథకాల పేరుతో రైతులను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటుందని అన్నారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చి లబ్ధి పొందిన బీఆర్ఎస్.. తర్వాత ఆ హామీని విస్మరించిందని ఫైర్ అయ్యారు. రైతులను బీఆర్ఎస్ సర్కార్ మభ్యపెడుతుందని విమర్శించారు. సాగునీటీ కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతులకు ఈ ప్రభుత్వం సాగునీరు కూడా ఇవ్వటం లేదన్నారు.
Read More..
తెలంగాణలో నెక్ట్స్ వచ్చేది ఆ ప్రభుత్వమే: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.