రాజాసింగ్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో (వీడియో)
శ్రీరామనవమి పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే నిర్వహిచిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఫోటో దర్శనం ఇవ్వడం కలకలం రేపింది.
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీరామనవమి పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే నిర్వహిచిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఫోటో దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. గురువారం దూల్ పేట్ లోని ఆకాష్ పూరి హనుమాన్ మందిర్ లో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు, భక్తులు పాల్గొన్నాయి. అయితే ర్యాలీలో రాజాసింగ్ వాహనంపై ఉండగా కింద యువకులు ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ క్రమంలో జైశ్రీరామ్ అనే జెండాలతో పాటు జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన వ్యక్తి నాథూరామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించారు. దీంతో ఈ ర్యాలీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే ఫోటోతో రాజా సింగ్ శోభాయాత్ర#Rajasingh #Hyderabad #BJP pic.twitter.com/57VZHw7NoH
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2023