పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
బీపీఈడీ, డీపీఈడీ ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ పూర్తయింది.
దిశ, తెలంగాణ బ్యూరో : బీపీఈడీ, డీపీఈడీ ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ పూర్తయింది. 753 మందికి మొదటి విడుతలో సీట్లు కేటాయించినట్లు పీఈసెట్ కన్వీనర్ రమేశ్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ కోటాలో బీపీఈడీకి 1437 సీట్లు, డీపీఈడీకి 300 సీట్లు కలిపి మొత్తం 1737 సీట్లు ఉండగా 753 మందికి సీట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. బీపీఈడీకి 669 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా 600 మందికి సీట్లు అలాట్ చేశారు. డీపీఈడీలో 229 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా 153 మందికి సీట్లు కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు తమ ఒరిజినల్ సిర్టిఫికెట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదుతో ఈనెల 28 లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా విద్యార్థులకు ఈనెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ రమేశ్ బాబు స్పష్టంచేశారు.