శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్ధుల భవిష్యత్‌కు ఆటంకం: శివసేన రెడ్డి
ఫీజులు, ర్యాంకుల కోసం విద్యార్ధులను వేధిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల అనుమతులను రద్దు చేయాలని రాష్ట్ర యూత్కాంగ్రెస్అధ్యక్షుడు శివసేన రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఫీజులు, ర్యాంకుల కోసం విద్యార్ధులను వేధిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల అనుమతులను రద్దు చేయాలని రాష్ట్ర యూత్కాంగ్రెస్అధ్యక్షుడు శివసేన రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. గురువారం నుంచి శ్రీ చైతన్య కాలేజీల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫీజుల కోసం తల్లిదండ్రులను, ర్యాంకుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఏకైక సంస్థ శ్రీ చైతన్య సంస్థ అని స్పష్టం చేశారు. శ్రీచైతన్య యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. టీచర్ఎమ్మెల్సీ అభ్యర్ధి హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నందుకు కాంగ్రెస్ తనకు మద్ధతు ఇచ్చిందన్నారు. టీచర్లకు కాంగ్రెస్ ఎప్పుడు అండగానే ఉంటుందన్నారు. సీపీఎస్ రద్దుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు సీసీఎస్‌ను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఉద్యోగులకు మేలు చేసింది కాంగ్రెస్‌పార్టీనేనని పేర్కొన్నారు.
ఇంటర్మీడియెట్‌బోర్డు ముట్టడి..
శ్రీ చైతన్య విద్యాసంస్థల వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవావాలని యూత్కాంగ్రెస్ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్కార్యకర్తలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులకు, యూత్కాంగ్రెస్నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇక శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్య ఒత్తిడితో నార్సింగి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ మృతికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల బంద్‌కు ఎన్ఎస్‌యూఐ పిలుపు నిచ్చింది.