మునుగోడు: పోలింగ్‌ రోజునే టీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు

అధికార టీఆర్ఎస్ పార్టీకి పోలింగ్‌ రోజునే వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోలింగ్ ప్రారంభమై ఒంటిగంట దాటుతున్నా మర్రిగూడ మండలం అనంతారం ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు.

Update: 2022-11-03 08:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీకి పోలింగ్‌ రోజునే వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోలింగ్ ప్రారంభమై ఒంటిగంట దాటుతున్నా మర్రిగూడ మండలం అంతంపేట ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని తేల్చిచెప్పారు. ఈ గ్రామానికి టీఆర్ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్ వ్యవహారించారు. గ్రామంలో 2162 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వారు ఓటు వేసేందు ససేమిరా అనడంతో తీరా పోలింగ్‌ రోజున టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. ఒకవైపు కేసీఆర్ బై పోలును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, మరో వైపు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని డిమాండ్ చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. మరోవైపు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పొలిటికల్ భవిష్యత్‌పైనా ఈ గ్రామ ఓట్లు ఆధారపడి ఉంది.

టీఆర్ఎస్‌లో కొత్త చర్చ.. MLC Kavitha Kalvakuntla ఎక్కడ?


Similar News