Secunderabad: తిరుపతి-జమ్మూ ఎక్స్‌ప్రెస్‌ రద్దు.. సికింద్రాబాద్ లో ప్రయాణికుల ఆందోళన

తిరుపతి - జమ్మూ ఎక్స్ ప్రెస్ రద్దవ్వడంతో.. సికింద్రాబాద్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తిరుపతి - జమ్మూ రైలు కోసం సుమారు 200 మంది ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అధికారులు అప్పటికప్పుడు రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు.

Update: 2024-11-13 07:11 GMT

దిశ, వెబ్ డెస్క్: పెద్దపల్లి - రాఘవాపూర్ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతుండగా.. దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లను రద్దు చేసింది. మరో 53 రైళ్లను దారి మళ్లించి, 7 రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలో తిరుపతి - జమ్మూ ఎక్స్ ప్రెస్ సైతం రద్దవ్వడంతో.. సికింద్రాబాద్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తిరుపతి - జమ్మూ రైలు కోసం సుమారు 200 మంది ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అధికారులు అప్పటికప్పుడు రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో తమకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమను వేరే మార్గాల్లో వెళ్లాలని చెప్తే ఎటు వెళ్లాలని వాపోతున్నారు. ప్రభుత్వం లేదా రైల్వే అధికారులే ప్రత్యామ్నాయం చూపాలని ఆందోళనకు దిగారు.

కాగా.. పట్టాలు తప్పిన గూడ్సురైలుకు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరో 15 గంటల సమయం పడుతుందని చెప్పారు. దీంతో సంపర్క్ క్రాంతి, నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

రద్దయిన రైళ్ల వివరాలు

నర్సాపూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - నాగ్ పుర్, హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ - కాగజ్ నగర్, కాజీపేట - సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - బోధన్, సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ - బల్లార్షా, బల్లార్షా - కాజేపేట, యశ్వంత్ పూర్ - ముజఫర్ పూర్, కాచిగూడ - నాగర్ సోల్, కాచిగూడ - కరీంనగర్, సికింద్రాబాద్ - రామేశ్వరం, సికింద్రాబాద్ - తిరుపతి, ఆదిలాబాద్ - పర్లి, అకోలా - పూర్ణ, ఆదిలాబాద్ - నాందేడ్, నిజామాబాద్ - కాచిగూడ, గుంతకట్టు - బోధన్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

Tags:    

Similar News