రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి: ఎంపీ ఈటల రాజేందర్

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-07-09 01:52 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి కార్యకర్తలు ప్రజల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 44 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ గడ్డమీద బీజేపీ సంపూర్ణంగా జెండా ఎగుర వేసిందన్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలను గెలుచుకుందనీ తెలిపారు.

బిఆర్ఎస్ పట్టు కోల్పోయింది.. వారి శఖం ముగిసిపోయింది

స్థానిక సంస్థలలో విజయం సాధించడమే మన లక్ష్యం. బిజెపి వారసత్వ రాజకీయాలతో వచ్చిన పార్టీ కాదు.. మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అని తెలిపారు.మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా మీకు నిత్యం అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాననీ అన్నారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి ఎన్నికల వరకు బీజేపీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. నాయకులు ఎలా ఉన్నా.. పార్టీ కార్యకర్త బరిగీసి కొట్లాడుతారని తెలిపారు. పార్టీ జెండాకి అవమానం జరిగితే తట్టుకోలేరన్నారు. నాకు కన్స్ట్రక్షన్ తప్ప డిస్టెక్షన్ తెలియదు.. కలవడం తప్ప విడదీయడం తెలియదు. గడ్డిపోచను కూడా గౌరవిస్తాను.. ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయను.

కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి

ఎథిక్స్ విలువలు లేకుండా పోయాయి. ఆయారాం గయారం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. యాంటీ డిఫెక్షన్ల తీసుకువచ్చింది రాజీవ్ గాంధీ అయితే ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు కావాలని మొన్న మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా చేర్చుకుంటున్నారు. బరితెగించి వ్యవహరిస్తున్నారు చట్టం మాకంటే చిన్నదిగా చూస్తున్నారు.

చట్టాన్ని అపహస్యం చేస్తున్నారు.

కేసీఆర్ ఏం చేసిండో మేము కూడా అదే చేస్తున్నామని చెప్పుకోవచ్చు.. కానీ కెసిఆర్ చెంప చెల్లుమనిపించి అడ్రస్ లేకుండా చేశారు అనే విషయం మర్చిపోవద్దు.కాంగ్రెస్ నాయకులు ఈరోజు సంబర పడుతున్నారు కానీ ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు. ఈ కలికాలంలో కూడా సిస్టం తప్పకుండా నడుస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. మల్కాజ్గిరి అభివృద్ధిలో నా ముద్ర వేసుకుంటాను అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ ను నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ,కార్పొరేటర్ కొంతం దీపిక మహంకాళి జిల్లా ప్రెసిడెంట్ రఘునందన్ గౌడ్, నాయకులు వంశ తిలక్, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News