పైసలే సీఎం కేసీఆర్‌ను బొంద పెడతాయ్: పాల్వాయి స్రవంతి ఫైర్
బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ఫైర్ అయ్యారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు పెద్ద పీట వెయ్యాలని చెబుతున్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చావని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ బయటి రాగానే కేసీఆర్ కూతురు కవితకు మహిళా రిజర్వేషన్ గురుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మహిళలపై రోజుకో అత్యాచారం జరుగుతోందని ఫైర్ అయ్యారు.
గిరిజన మహిళపై పోలీసుల దాడి, మీర్ పేటలో 16 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలు చూసి సిగ్గుపడాలన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి.. గ్లాసుల తెలంగాణ చేశారని సెటైర్ వేశారు. రాష్ట్రంలో పిల్లలను చదువులకు దూరం చేసి.. కులవృత్తులను ప్రోత్సహించడం వెనుక వున్న మతలాబ్ ఏంటీ అని ప్రశ్నించారు. తెలంగాణలో మద్యం పాలన నడుస్తోందని మునుగోడు ఉపఎన్నికలోనే తేలిందని.. చివరకు సీఎం కేసీఆర్‌ను పైసలే బొంద పెడతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.