ఆయన మరణం జానపద కళకు తీరని లోటు.. భట్టీ ఆసక్తికర పోస్ట్ ఇదే

పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Update: 2024-06-23 12:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సకిని రామచంద్రయ్య మృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర ట్వీట్ చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహిత కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటు అని పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కలను జీవనాధారంగా చేసుకొని అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి తన డోలు వాయిద్యంతో దేశవ్యాప్తంగా కీర్తిని సాధించి పెట్టారన్నారు. వారి అకాల మరణం పట్ల వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

Tags:    

Similar News