ఉత్కంఠ పోరులో మాధవి లత పై ఒవైసీ గెలుపు.. మెజారిటీ ఎంతంటే..?
2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశ రాజకీయాలు మొత్తం హైదరాబాద్ వైపు మళ్లాయి.
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశ రాజకీయాలు మొత్తం హైదరాబాద్ వైపు మళ్లాయి. బీజేపీ, ఎంఐఎం మధ్య పోటా పోటిగా సాగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే చర్య దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా మాధవి లత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఒవైసీని ముచ్చెమటలు పట్టించింది. మొదటి ఐదు రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగిన మాధవి లత.. ఆ తర్వాత తన ఆధిక్యాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో ఒవైసీ బీజేపీ అభ్యర్థి పై ఏకంగా 3,15,811 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఇది అతనికి వరుసగా ఐదో విజయం కావడం విశేషం. కాగా ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో విజయం దిశగా ముందుకు దూసుకుపోతుంది. అలాగే అధికార కాంగ్రెస్ కూడా 8 స్థానాల్లో విజయం సాధించింది.