రెపో రేట్ల పెంపు.. ఆర్బీఐ నిర్ణయంపై ఒవైసీ కౌంటర్!
రెపో రేటును 35 బేసిస్ పాయిట్లు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై హైదారాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రెపో రేటును 35 బేసిస్ పాయిట్లు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై హైదారాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. రిజర్వు బ్యాంక్ 2022లో వడ్డీ రేట్లను 2.25 శాతం పెంచిందని అన్నారు. కానీ ఎస్ బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ రేటు కేవలం 1 శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఓ వైపు వడ్డీ రేట్లు పెంచుతూ మరో వైపు ఫిక్స్డ్ డిపాజిట్ రేటు పెంచకపోడవంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యత్యాసాన్ని చూపిస్తూ సీనియర్ సిటిజన్లు, మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు మోసపోతున్నాయి? అంటూ ప్రశ్నించారు. గురువారం రెపో రేటు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ప్రకటనపై గురువారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన పై విధంగా కామెంట్స్ చేశారు.