Sridhar Babu: తెలంగాణ వన్‌ ట్రిలియన్‌ ఎకానమీ చేరుకోడమే మా లక్ష్యం: శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-09-18 10:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేస్తున్నామని, దీని ద్వారా మా లక్ష్యం, మా ఆలోచన, మా దృక్పథాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మాదాపూర్ లో జరిగిన ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన శ్రీధర్ బాబు.. మన రాష్ట్రం వన్‌ ట్రిలియన్‌ ఎకానమీ చేరుకోవాలని సీఎం సంకల్పించారని చెప్పారు. ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలు అని వీటిని కాపాడుకోవాలని మా నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ అభివృద్దిలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు. పరిశ్రమల సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన తర్వాతే నూతన పాలసీని తీసుకువచ్చామన్నారు.


Similar News