కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.

Update: 2024-08-15 16:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు మహిళా కమీషన్ అభిప్రాయ పడింది. తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించగా.. దానిపై కేటీఆర్ స్పందిస్తూ, 'బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు' అని అన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా.. మహిళా కమిషన్ విచారణకు ఆదేశించిది.  


Similar News