ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత.. 5వ రోజుకు చేరిన ఆపరేషన్

శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత బోన్లకు చిక్కుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత 5 వ రోజుకు చేరుకుంది.

Update: 2024-05-02 08:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత బోన్లకు చిక్కుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత 5 వ రోజుకు చేరుకుంది. దీంతో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్టు పరిసరాల్లో 5 బోన్లలో ఐదు మేకలను ఉంచడంతో పాటు 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత కదలికల్ని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేకలను ఎరగా వేసిన కూడా చిరుత బోనులోకి రావడం లేదు. బోను వరకు వచ్చిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దాదాపు చిరుత కదలికలు 20 ట్రాప్ కెమెరాల్లో అధికారులకు చిక్కాయి. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండటంతో చిరుత వేరే ప్రాంతానికి వెళ్లడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో అధికారులకు చిరుతను పట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్టు ప్రహరి నుంచి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Tags:    

Similar News