రేవంత్ రెడ్డిపై మరోసారి Marri Shasidhar Reddy కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మరోసారి మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-24 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మరోసారి మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి బహిష్కరించడం కాదు.. తానే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న తనను సస్పెండ్ చేసే అధికారం పీసీసీకి లేదని అన్నారు. ఇప్పటివరకు తాను చేసిన ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ ఇద్దరూ వివరణ ఇవ్వలేదని గుర్తుచేశారు. రేవంత్ ఉన్నంతవరకు కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. 

Also Read..

టీ కాంగ్రెస్‌లోకి ఏపీ నేత ఎంట్రీ.. రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ 

Tags:    

Similar News